- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జులై 24 నుంచి ముంబైలో మొదటి అండర్‌గ్రౌండ్ మెట్రో స్టార్ట్
దిశ, నేషనల్ బ్యూరో: ముంబైలో మొదటి అండర్‌గ్రౌండ్ మెట్రో రైలు కార్యకలాపాలు జులై 24 నుంచి ప్రారంభం అవుతాయని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే బుధవారం తెలిపారు. ఎక్స్‌లో వ్యాఖ్యానించిన ఆయన ముంబై వాసుల జీవితాలకు మెరుగుదలు అందిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా సులభతర ప్రయాణం కోసం జులై 24 న భూగర్భ మెట్రో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. అభివృద్ధి చెందుతున్న నగర వేగానికి భూగర్భ మెట్రో కొత్త ఊపునిస్తుందని తావ్డే చెప్పారు.
మెట్రో లైన్ 3ని ముంబై మెట్రో ఆక్వా లైన్ లేదా కొలాబా-బాంద్రా-సీప్జ్ లైన్ అని కూడా పిలుస్తారు. మొదటి దశలో ఇది ఆరే కాలనీ నుండి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వరకు నడుస్తుంది. 33.5 కి.మీ భూగర్భ మార్గంలో 1.7 మిలియన్ల రోజువారీ ప్రయాణికులు ప్రయాణిస్తారని అంచనా. ఈ లైన్‌లో మొత్తం 27 స్టాప్‌లు ఉన్నాయి. వీటిలో 26 స్టేషన్లు భూగర్భంలో ఉంటాయి.
ఇది దక్షిణ ముంబైని నగరం పశ్చిమ శివారు ప్రాంతాలకు కలుపుతుంది. 35.5 కి.మీ ప్రయాణానికి 50 నిమిషాలు పడుతుంది, ఇది సాధారణంగా రోడ్డు మార్గంలో రెండు గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఈ మార్గంలో ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ (MMRC) రూ. 37,000 కోట్లు ఖర్చు చేసింది. టన్నెల్ రెండో దశతో సహా మొత్తం ప్రాజెక్టు పూర్తి కావడానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది.