- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బటర్ చికెన్ ను కనిపెట్టింది ఎవరు?.. ఢిల్లీ హైకోర్టుకు ఈ వివాదం
దిశ నేషనల్ బ్యూరో: బటర్ చికెన్ ను ఎవరు కనిపెట్టారు. ఈ వివాదంపై హైకోర్టుకు వెళ్లాయి రెండు రెస్టారెంట్లు. బటర్ చికెన్, దాల్ మఖ్నీ ఈ వంటకాల కోసం మోతీ మహల్, దర్యాగంజ్ రెస్టారెంట్లు ఫైట్ చేస్తున్నాయి. ఈ ఫుడ్ కోసం ఢిల్లీ హైకోర్టులో న్యాయపోరాటానికి దిగాయి. దర్యాగంజ్ రెస్టారెంట్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని.. మోతీమహల్ ఆరోపించింది. ఈ నెల 16న దీనిపై విచారణ జరిగింది. నెలలోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలని దర్యాగంజ్ రెస్టారెంట్ కు ఆదేశించింది ఢిల్లీ హైకోర్టు.
ఈ రెండు రెస్టారెంట్లు బటర్ చికెన్, దాల్ మఖ్కీని కనిపెట్టినట్లు కొన్నాళ్లుగా ప్రకటించుకుంటున్నాయి. మోతీ మహల్ వ్యవస్థాపకుడు కుందన్ లాల్ గుజ్రాల్ కనిపెట్టినట్లు కోర్టుకు తెలిపింది. అమ్ముడుకాని తందూరీ చికెన్ కి కొన్ని మసాలాలు, సాస్ కలిపి బటర్ చికెన్ తయారు చేసినట్లు స్పష్టం చేసింది. మరోవైపు తమ పూర్వీకుడు కుందన్ లాల్ జగ్గీ బటర్ చికెన్ ను కనిపెట్టినట్లు దర్యాగంజ్ తెలిపింది.
మోతీమహల్ రెస్టారెంట్ పాక్ లోని పెషావర్ లో కుందన్ లాల్ గుజ్రాల్, కుందన్ లాల్ జగ్గీల మధ్య జాయింట్ వెంచర్ గా ఉందని కోర్టుకు తెలిపారు దర్యాగంజ్ తరఫు న్యాయవాది. దీనిపై తదుపరి విచారణ మే 29న చేపట్టనున్నట్లు తెలిపింది ఢిల్లీ కోర్టు.
- Tags
- butter chicken