- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cyber Centre: నకిలీ కాల్స్‌తో అమెరికన్‌లను మోసం చేస్తున్న 21 మందిని అరెస్ట్ చేసిన మొహాలీ పోలీసులు
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికన్లను మోసగించిన వ్యవహారంలో 21 మందిని అరెస్ట్ చేసినట్టు పంజాబ్‌లోని మొహాలీ పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో 17 మంది పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి వివరాలు వెల్లడించిన మొహాలీ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) జ్యోతి యాదవ్.. మొహాలీ పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో అక్రమంగా సైబర్ సెంటర్‌ను నడుపుతున్న 21 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారంతా అమెరికాకు చెందిన పౌరులను మోసపూరిత కాల్స్ ద్వారా మోసం చేస్తున్నట్టు తేలింది. నిందితుల ఫ్లాట్‌లలో నిర్వహించిన సోదాల్లో 20 ల్యాప్‌టాప్‌లు, రూ. 1.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని ' వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో నలుగురు ఆఫ్రికన్ పౌరులు, దేశీయంగా పశ్చిమ బెంగాల్, పంజాబ్, రాజస్థాన్, బిహార్ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. పోలీసు, కస్టమ్స్ అధికారుల పేరుతో బాధితులకు ఫోన్ చేసి వారి నుంచి నగదును దోచుకుంటున్నారని, మెక్సికన్ సరిహద్దులో తమ పార్శిల్ స్వాధీనం చేసుకున్నట్టు, అందులో డ్రగ్స్ ఉన్నట్టు మోసగిస్తున్నారు. వారి ప్రయేయం లేదనుకుంటే తాము పంపే లింక్‌లను క్లిక్ చేసి వివరాలు ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు.