BREAKING: ప్రధానిగా ప్రమాణ స్వీకారంపై మోడీ కీలక ప్రకటన

by Satheesh |
BREAKING: ప్రధానిగా ప్రమాణ స్వీకారంపై మోడీ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ నరేంద్ర మోడీ అయ్యారు. ఎన్డీఏ పక్ష నేతలతో కలిసి శుక్రవారం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన మోడీ.. తనను లోక్ సభ పక్షనేతగా ఎన్డీఏ మిత్రపక్షాలు ఎన్నుకున్న తీర్మానాన్ని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకు అందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని మోడీ రాష్ట్రపతిని కోరారు. ఎన్డీఏ మిత్ర పక్షాల తీర్మానాన్ని పరిశీలించిన అనంతరం ద్రౌపది ముర్ము మోడీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. రాష్ట్రపతి ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆదివారం సాయంత్రం మూడోసారి భారత ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక, రాష్ట్రపతితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎల్లుండి (ఆదివారం) సాయంత్రం మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తానని తెలిపారు.

ఆజాదీకా అమృత్‌ కాల్ ఉత్సవాల తర్వాత ఇది తొలి ఎన్నికని.. దేశానికి సేవ చేసే అవకాశం మాకు మూడోసారి లభించిందన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు దేశ ప్రజలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు తగ్గట్టుగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. మంత్రిమండలి ఏర్పాటుకు రాష్ట్రపతి పలు సూచనలు చేశారని, ప్రమాణ స్వీకారానికి ముందు కొత్త మంత్రుల పేర్లను రాష్ట్రపతికి అందజేస్తామని స్పష్టం చేశారు. మున్ముందు మరింత బాధ్యత, ఉత్సాహంతో పనిచేస్తామన్నారు. కాగా, ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 290 ప్లస్ సీట్లు సాధించి హ్యాట్రిక్ కొట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed