- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Book Release: ‘మోడీస్ గవర్నెన్స్ ట్రయంఫ్’ బుక్ రిలీజ్
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ రచించిన “మోడీస్ గవర్నెన్స్ ట్రయంఫ్: రీషేపింగ్ ఇండియాస్ పాత్ టు ప్రాస్పెరిటీ” పుస్తకాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి శనివారం రిలీజ్ చేశారు. మోడీ హయాంలోని పాలనా పరమైన విజయాలు, మోడీ ప్రభుత్వం చేపట్టిన పలు కీలక సంస్కరణలను తరుణ్ చుగ్ ఈ పుస్తకంలో పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రచారం నుండి జీఎస్‌టీ ప్రవేశంతో పన్నుల వ్యవస్థలో భారీ మార్పుల వరకు, ప్రతి అధ్యాయం ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యంలో పాలనను పునర్నిర్వచించిన మోడీ నాయకత్వ పటిమను ఈ పుస్తకంలో వివరించారు. మోడీ సాధించిన విజయాలను మాత్రమే కాకుండా మోడీ పదవీకాలంలో ని సవాళ్లు, వివాదాలను సైతం విమమర్శనాత్మకంగా ఈ పుస్తకంలో తరుణ్ చుగ్ వివరించారు. దేశంలో జరుగుతున్న మార్పులు, దేశం యొక్క భవిష్యత్తు ను పునర్నిర్మించడంలో ప్రధాన మంత్రి మోడీ పోషిస్తున్న పాత్రను అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం దోహదపడనున్నది.