- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేను చెప్పిన ‘శక్తి’ మోడీయే.. అధికార దాహమే ఆయన పరమావధి : రాహుల్
దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ‘శక్తి’ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘‘శక్తిని కొలిచే దేశంలో.. ‘శక్తి’ గురించి ఇలాంటి మాటలా ?’’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ధ్వజమెత్తిన నేపథ్యంలో రాహుల్ గాంధీ స్పందించారు. తాను చేసిన ‘శక్తి’ వ్యాఖ్యలను ప్రధాని మోడీ వక్రీకరించి మాట్లాడారని తెలిపారు. ‘‘మోడీకి నా మాటలు నచ్చవు. ఆయన నా వ్యాఖ్యలను వక్రీకరించడానికి, వాటి అర్థాన్ని మార్చేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే నేను లోతైన సత్యాన్ని మాట్లాడానని ఆయనకు తెలుసు’’ అని రాహుల్ వివరించారు. ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ.. ‘‘మేం ఎవరికి వ్యతిరేకంగానైతే పోరాడుతున్నామో ఆ వ్యక్తే ‘శక్తి’. అది మరెవరో కాదు మోడీజీ. భారతదేశ స్వరం, సంస్థలు, సీబీఐ, ఐటీ, ఈడీ, ఎన్నికల సంఘం, మీడియా, పరిశ్రమలు, రాజ్యాంగ నిర్మాణం వంటివన్నీ స్వాధీనం చేసుకున్న ‘శక్తి’ అది’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘‘మోడీజీ శక్తి (అధికారం) కోసం వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశారు. అయినప్పటికీ దేశంలో కొన్ని వేల రూపాయల అప్పులను కట్టలేక రైతులు సూసైడ్ చేసుకుంటున్న వైనాన్ని మనం చూస్తున్నాం’’ అని ఆయన మండిపడ్డారు. ఈమేరకు రాహుల్ గాంధీ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఒక పోస్ట్ చేశారు.