Jana Oushadhi : కాచిగూడలో జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించనున్న మోడీ

by M.Rajitha |   ( Updated:2024-11-12 15:57:48.0  )
Jana Oushadhi : కాచిగూడలో జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించనున్న మోడీ
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) కాచిగూడ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన జన ఔషధి కేంద్రాన్ని(Jana Oushadhi Outlet) బుధవారం ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 18 ప్రాంతాల్లో రేపు జన ఔషధి కేంద్రాలను ప్రధాని రిమోట్ వీడియో లింక్ ద్వారా ప్రారంభించనున్నారు. కాగా కాచిగూడలో జరిగే ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పాల్గొననున్నారు. పీఎంబీజేకే(PMBJK) ద్వారా అన్ని వర్గాల ప్రజలకు అతి తక్కువ ధరలకే మందులు అందిచడమే జన ఔషధీ కేంద్రాల ముఖ్య ఉద్దేశం అని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Next Story