ఆ కేసు విషయంలో ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలి.. రాహుల్ గాంధీ డిమాండ్

by Disha Web Desk 5 |
ఆ కేసు విషయంలో ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలి.. రాహుల్ గాంధీ డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజ్వల్ రేవణ్ణకు సపోర్టు చేసినందుకు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోకి శివమొగ్గలో పర్యటించిన ఆయన ప్రజ్వల్ రేవణ్ణ కేసు అంశంపై స్పందించారు. ప్రజ్వల్ రేవణ్ణ కేసు అనేది అతిపెద్ద సమస్య అని.. దాదాపు 400 మంది మహిళలపై అత్యాచారం చేశాడని అన్నారు. అంతమంది జీవితాలతో ఆడుకున్న ప్రజ్వల్ రేవణ్ణను ప్రధాని మోడీ సమర్ధించాడని, ముందుగా ఆయన సమాధానం చెప్పాలన్నారు. అంతేగాక మహిళలకు కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ ఎన్డీఏ కూటమి అభ్యర్ధిగా కర్ణాటక లోని హసన పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రజ్వల్ కు మద్దతుగా నిలిచిన కొద్ది రోజుల తర్వాత ప్రజ్వల్ రేవణ్ణపై కేసు నమోదు అయ్యింది.

Next Story

Most Viewed