జూన్ 30 నుండి 'మన్ కీ బాత్' స్టార్ట్

by Harish |
జూన్ 30 నుండి మన్ కీ బాత్ స్టార్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ తన మనసులోని మాటలను ప్రజలతో పంచుకునే 'మన్ కీ బాత్' కార్యక్రమం జూన్ 30 నుండి పునః ప్రారంభమవుతుందని మోడీ మంగళవారం తెలిపారు. ఆయన తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో వ్యాఖ్యానిస్తూ, ఎన్నికల కారణంగా మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహించలేదు, కొన్ని నెలల విరామం తర్వాత ఇప్పుడు తిరిగి వస్తుంది. ఈ నెల కార్యక్రమం ఆదివారం, 30 జూన్ నాడు ప్రసారం కానుంది. దీని కోసం మీ ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకోవాలని నేను మీ అందరికీ పిలుపునిస్తున్నాను. MyGov ఓపెన్ ఫోరమ్, NaMo యాప్‌లో లేదా 1800 11 7800 నంబర్‌లో మీ అభిప్రాయాలను పంచుకోవాలని ప్రధాని మోడీ కోరారు.

ప్రతినెలా చివరలో మోడీ 'మన్ కీ బాత్' ప్రసారాన్ని నిర్వహిస్తారు. చివరిసారిగా ఫిబ్రవరి 25న ప్రసారం చేశారు. ఈ 110వ ఎపిసోడ్‌లో, ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కును పొందిన వారు రికార్డు సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రకటన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) మార్గదర్శకాల ప్రకారం, తాత్కాలికంగా కార్యక్రమానికి విరామం ఇచ్చారు. తాజాగా ఎన్నికల ప్రక్రియ ముగియడంతో తిరిగి మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోడీ మరలా కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు.

Advertisement

Next Story