Dy.CM Pavan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన ఖరారు

by Maddikunta Saikiran |
Dy.CM Pavan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్:తిరుమల లడ్డూ(Tirumala Laddu) తయారీపై గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు(Animal Fat) వాడారని ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) స్వయంగా ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు(AP Politics) వేడెక్కాయి.లడ్డూ వివాదంపై ఏపీ ప్రభుత్వం సిట్(SIT)ను కూడా ఏర్పాటు చేసింది.ఆదివారం నుంచి మూడురోజుల పాటు సిట్ దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది.తిరుమల లడ్డూ అపవిత్రం కావడం వల్ల జనసేన(Janasena) అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Dy.CM Pavan Kalyan) ఏకంగా ప్రాయశ్చిత్త దీక్ష(Atonement Initiation)ను స్వీకరించారు.కాగా అక్టోబర్ 3వ తేదీన తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. అక్టోబర్ 2న సాయంత్రం 4గంటలకు రేణిగుంట విమానాశ్రయం(Renigunta Airport) చేరుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సా.5కి అలిపిరి(Alipiri)కి, అక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా రాత్రి .9కి తిరుమలకు చేరుకుంటారు.3వ తేదీన ఉదయం స్వామి వారిని దర్శించుకుని దీక్షను విరమిస్తారు. అనంతరం సాయంత్రం తిరుపతిలో జరిగే వారాహి సభలో పాల్గొంటారు.తిరుమల లడ్డూ, వంద రోజుల పరిపాలన, సూపర్ 6 హామీల అమలు వంటి అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed