Haryana Assembly Elections: హర్యానా ఎన్నికల ప్రచారంలో మోడీ.. తొలి ర్యాలీ అక్కడి నుంచే షురూ!

by karthikeya |   ( Updated:2024-09-25 05:03:50.0  )
Haryana Assembly Elections: హర్యానా ఎన్నికల ప్రచారంలో మోడీ.. తొలి ర్యాలీ అక్కడి నుంచే షురూ!
X

దిశ, వెబ్‌డెస్క్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో తన తొలి ప్రచార ర్యాలీని ఈ రోజు (బుధవారం) ప్రారంభించనున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీ తెలిపారు. గోహనా నియోజకవర్గంలో ప్రధాని మోడీ తొలి ర్యాలీ ఉంటుందని, ఈ ర్యాలీలో 22 అసెంబ్లీలకు చెందిన కార్యకర్తలు, అభ్యర్థులు పాల్గొంటారని తెలిపిన బడోలీ.. ఈ ఎన్నికల కోసం మోడీ ఏకంగా 22 అసెంబ్లీ స్థానాల్లో ర్యాలీలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ఇక ఇదే విషయంపై ప్రధాని మోడీ కూడా ఎక్స్‌ వేదికగా మంగళవారం స్పెషల్ సందేశాన్ని పోస్ట్ చేశారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ర్యాలీ మొదలవుతుందని, పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. ‘హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని గట్టిగా నిర్ణయించుకోవడం జరిగింది. ప్రజాస్వామ్య వేడుకల్లో రెట్టించిన ఉత్సాహంతో రేపు మధ్యాహ్నం 12 గంటలకు సోనిపట్‌లో జరిగే ర్యాలీలో ప్రజల ఆశీర్వాదం పొందే భాగ్యం మనకు కలుగుతుంది’’ అంటూ ప్రధాని మోదీ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

ఇదిలా ఉంటే అమెరికా పర్యటన తర్వాత భారత్ చేరుకున్న ప్రధాని మోడీ చేస్తున్న తొలి ఎన్నికల ర్యాలీ కావడంతో ఈ ర్యాలీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న పోలింగ్ జరగనుండగా.. ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed