ప్రపంచదేశాల్లో మార్పు తెచ్చే వ్యక్తి.. మోడీపై బ్రిటన్ మాజీ ప్రధాని ప్రశంసలు

by Shamantha N |   ( Updated:2024-10-13 09:31:14.0  )
ప్రపంచదేశాల్లో మార్పు తెచ్చే వ్యక్తి.. మోడీపై బ్రిటన్ మాజీ ప్రధాని ప్రశంసలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్(Boris Johnson) ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. ప్రపంచదేశాల్లో మార్పు తెచ్చే ఉన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. కాగా.. మోడీ గురించి ఓ పుస్తకంలో బోరిస్ జాన్సర్ రాసిన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా ఈ పుస్తకం త్వరలో యూకేలో విడుదల కానుంది. ‘అన్‌లీష్‌డ్‌’ పేరిట బోరిస్ జాన్సన్ రాసిన పుస్తకంలో ఆయన తన రాజకీయ జీవితం గురించి ప్రస్తావిస్తూ.. ప్రధాని మోడీతో సమావేశమైన వివిధ సందర్భాల గురించి వివరించారు. మోడీతో తన మొదటి సమావేశం గురించి ప్రస్తావించారు. ఆయనను కలిసినప్పుడు తాను ఆనందంగా ఉంటానని పేర్కొన్నారు.తనకున్న అత్యంత సన్నిహిత మిత్రుల్లో మోడీ ఒకరని తెలిపారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా-వాణిజ్య ఒప్పందాలకు మోడీ పునాది వేశారన్నారు. ‘‘2022లో నేను పలు వివాదాల్లో చిక్కుకున్నాను. వీటిపై బ్రిటన్ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. దీంతో ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ.. రిషి సునాక్‌ నాకు ద్రోహం చేశారు. ఆయన కారణంగానే సొంత పార్టీ నేతలు కూడా నాకు దూరమయ్యారు’’ అని బోరిస్‌ జాన్సన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

నెతన్యాహుపై ఆరోపణలు

ఇక తన మాజీ భార్య మెరీనా వీలర్‌ సిక్కు వారసత్వ కుటుంబానికి సంబంధించిన వారని ఆయన వెల్లడించారు. ఇదే పుస్తకంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై బోరిస్‌ చేసిన సంచలన ఆరోపణలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ నెతన్యాహుపై బోరిస్ సంచలన ఆరోపణలు చేశారు. నెతన్యాహు ఓసారి తన వ్యక్తిగత బాత్‌రూమ్‌ను ఉపయోగించారని.. ఆ తర్వాత అందులో వాయిస్ వినే ఎక్విప్ మెంట్ ఉన్నట్లు గుర్తించామన్నారు. తాను బ్రిటన్ విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed