- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ ప్రజలను రెచ్చగొడుతున్నారు: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) అధినేత శరద్ పవార్, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఇతర నాయకులతో కలిసి ముంబైలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖర్గే ప్రసంగిస్తూ ప్రధాని మోడీపై మండిపడ్డారు. మోడీ ప్రజాస్వామ్యం గురించి పదే పదే మాట్లాడుతున్నారని కానీ ఏనాడూ దాని సిద్దాంతాలకు కట్టుబడి ఉండలేదని విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే, రామమందిరంపైకి బుల్డోజర్లు వెళ్తాయని మోడీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘ కాంగ్రెస్ ఎవరిపైనా బుల్డోజర్ ప్రయోగించలేదు. మోడీకి మాత్రమే ఆ అలవాటు ఉంది. కాంగ్రెస్ ఎప్పటికీ చేయలేని పనులపై, అమలు చేయం సాధ్యం కాని వాటిపై ప్రజలకు అబద్దాలు చెబుతున్నారు’ అని వ్యాఖ్యానించారు.
మోడీ ఎక్కడికి వెళ్లినా, విభజన సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, సమాజాన్ని విభజించాలనుకోవడం సరికాదని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ముస్లిం లీగ్ మేనిఫెస్టోగా అభివర్ణించిన మోడీ, ఇప్పుడు అది మావోయిస్టు మేనిఫెస్టో అని అంటున్నారన్నారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు కొనసాగుతాయని, దానిని ఎవరూ ముట్టుకోలేరని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని నొక్కి చెప్పారు. జీఎస్టీ స్థానంలో సరళమైన, ఒకే రేటు జీఎస్టీని అమలు చేస్తామని చెప్పారు. అనంతరం ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతూ.. జూన్ 4వ తేదీ నుంచి దేశంలో అచ్చే దిన్ రాబోతుందని తెలిపారు. ఉద్యోగాల వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ ఇండియా కూటమి ర్యాలీలో పాకిస్థాన్ జెండాలు అంటూ ప్రచారం చేస్తోందని ఆరోపించారు.