- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇజ్రాయెల్‌తో యుద్దం.. పాలస్తీనా అధ్యక్షుడికి మోదీ ఫోన్
దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య గత కొద్దిరోజులుగా భీకర యుద్దం జరుగుతోంది. పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థకు చెందిన మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై ఒక్కసారిగా దాడికి పాల్పడంతో రెండు దేశాల మధ్య యుద్దం మొదలైంది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ రాకెట్లతో దాడులకు దిగుతుండగా.. హమాస్ కూడా తిప్పికొడుతుంది. బాంబు దాడుల్లో ఇప్పటివరకు ఇరు వర్గాలకు చెందిన 5 వేల మంది మరణించినట్లు చెబుతున్నారు. అలాగే వైమానిక దాడుల్లో వేలమంది గాయపడ్డారు.
ఈ క్రమంలో ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్దంపై ప్రపంచ దేశాల నేతలు స్పందిస్తున్నారు. ఆయా దేశాల నేతలకు ఫోన్లు చేసి యుద్దం ఆపేయాలని, శాంతి చర్చలు ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఈ విషయాన్ని మోదీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. పాలస్తీనాలోని గాజాలోని ఓ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో చాలామంది మృతి చెందారు. బాధితులకు సంతాపం ప్రకటించిన మోదీ.. పాలస్తీనా ప్రజలకు సాయం చేస్తామని ఫోన్లో హామీ ఇచ్చారు. పాలస్తీనాలో నెలకొన్న తీవ్రవాదం, హింసపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
Spoke to the President of the Palestinian Authority H.E. Mahmoud Abbas. Conveyed my condolences at the loss of civilian lives at the Al Ahli Hospital in Gaza. We will continue to send humanitarian assistance for the Palestinian people. Shared our deep concern at the terrorism,…
— Narendra Modi (@narendramodi) October 19, 2023