- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్ జోడో యాత్రలో 'Mobile library' ఏర్పాటు
దిశ, వెబ్ డెస్క్: భారత్ జోడో యాత్రలో భాగంగా 'మొబైల్ లైబ్రరీ'ని ఏర్పాటు చేసినట్లు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ లీగల్ ఎయిడ్ కోఆర్డినేటర్ అవని బన్సాల్ తెలిపారు. ఇందులో వివిధ విషయాలకు సంబంధించి దాదాపు 1000 పుస్తకాలు పాఠకులకు అందుబాటులో ఉంటాయని ఆమె చెప్పారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని ఉజ్జియిన్ లో కొనసాగుతోంది. ప్రజల్లో దేశ సమైక్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ లైబ్రరీని ఏర్పాటు చేసినట్లు ఆమె స్పష్టం చేశారు. ఒక పెద్ద ట్రక్ లో ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీని రాహుల్ గాంధీ గురువారం ప్రారంభించారని వెల్లడించారు. యాత్ర తర్వాత దేశవ్యాప్తంగా 500 లైబ్రరీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాజకీయం, చరిత్ర, ఆధ్యాత్మికత, ఫిక్షన్, ప్రముఖుల జీవిత చరిత్రలకు సంబంధించిన అనేక పుస్తకాలు ఈ మొబైల్ లైబ్రరీలో ఉంటాయని పేర్కొన్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలకు సంబంధించిన పుస్తకాలు కూడా ఉంటాయని ఆమె తెలిపారు.