Border : సరిహద్దు వివాదంపై అసోం, మిజోరం చర్చలు సఫలం

by Hajipasha |
Border : సరిహద్దు వివాదంపై అసోం, మిజోరం చర్చలు సఫలం
X

దిశ, నేషనల్ బ్యూరో : అసోం, మిజోరం రాష్ట్రాల మధ్య చాలా ఏళ్లుగా సరిహద్దు వివాదం నెలకొంది. దీనిపై శుక్రవారం మిజోరంలోని ఐజ్వాల్‌ వేదికగా ఇరు రాష్ట్రాల ప్రతినిధి బృందాలు సమావేశమై చర్చలు జరిపాయి. మిజోరం ప్రతినిధి బృందానికి ఆ రాష్ట్ర హోం మంత్రి కె.సప్దంగ, అసోం ప్రతినిధి బృందానికి ఆ రాష్ట్ర భద్రతా వ్యవహారాల మంత్రి అతుల్ బోరా సారథ్యం వహించారు. సానుకూల వాతావరణంలో ఈ చర్చలు జరిగాయి.

సరిహద్దు వివాదానికి సామరస్యపూర్వక మార్గంలో ఒక పరిష్కారాన్ని కనుగొనాలని ఇరుపక్షాలు నిర్ణయించుకున్నాయి. మిజోరం, అసోం సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులను కొనసాగించాలని తీర్మానించారు. సరిహద్దు వివాదంపై ఈ రాష్ట్రాల మధ్య 2021 ఆగస్టు నుంచి ఇప్పటివరకు నాలుగు సార్లు చర్చలు జరిగాయి.

Advertisement

Next Story

Most Viewed