- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికాలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం!
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో తెలంగాణకు చెందిన విద్యార్థి అదృశ్యమయ్యాడు. విస్కాన్సిన్ రాష్ట్రంలోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్న చిందకింది రూపేశ్ చంద్ర కనిపించడం లేదని చికాగోలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఎక్స్‌లో పోస్టు చేసింది. ‘మే 2వ తేదీ నుంచి ఇండియా స్టూడెంట్ రూపేశ్ చంద్ర మిస్సింగ్ అవడం పట్ల ఆందోళన చెందుతున్నాం. రూపేశ్ ఆచూకీ కోసం పోలీసులు, ప్రవాస భారతీయులతో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని పేర్కొంది. షెరిడాన్ రోడ్డులోని 4300 బ్లాక్ నుంచి రూపేశ్ కనిపించకుండా పోయినట్లు చికాగో పోలీసులు తెలిపారు. రూపేశ్ ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే యూఎస్‌లోని భారతీయ విద్యార్థుల భద్రతపై ఆందోళనలు నెలకొన్న వేళ తాజాగా విద్యార్థి కనిపించకుండా పోవడం వాటిని మరింత పెంచింది.
రూపేశ్ చంద్ర తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లాకు చెందిన వ్యక్తి. వరంగల్ లోని ఎస్ ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసి మాస్టర్ చేయడానికి యూఎస్ వెళ్లాడు. అయితే రూపేశ్‌తో మాట్లాడానికి ఈ నెల 2వ తేదీన వాట్సాప్ కాల్ చేశానని అతని తండ్రి సదానందం తెలిపారు. అప్పుడు పనిలో ఉన్నానని చెప్పి పోన్ పెట్టేశాడని పేర్కొన్నారు. ఇక అప్పటి నుంచి మళ్లీ అందుబాటులోకి రాలేదని వెల్లడించారు. కాగా, అంతకుముందు తప్పిపోయిన 25 ఏళ్ల భారతీయ విద్యార్థి అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్ నగరంలో శవమై కనిపించాడు. దీంతో రూపేశ్ అదృశ్యమవడంతో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు ఈ ఏడాది ప్రారంభం నుంచి అమెరికాలో భారతీయ విద్యార్థులపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.