రేపు రాత్రి ఆకాశంలో అద్భుతం.. ఈ సమయంలో ఒకే చోట కనిపించనున్న 5 గ్రహాలు

by Mahesh |   ( Updated:2023-03-27 14:18:03.0  )
రేపు రాత్రి ఆకాశంలో అద్భుతం.. ఈ సమయంలో ఒకే చోట కనిపించనున్న 5 గ్రహాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆకాశంలో అరుదైన, అద్భుతమైన దృశ్యం మరోసారి ఆవిష్కృతం కానుంది. రేపు రాత్రి నింగిలో ఒకే చోట ఐదు గ్రహాలు దర్శనమివ్వనున్నాయి. బృహస్పతి, బుధుడు, శుక్రుడు, యురేనస్, అంగారకుడు ఈ ఐదు గ్రహాలు ఆకాశంలో ఒకే చోట చేరి అరుదైన దృశ్యం సృష్టించనున్నాయి. రేపు రాత్రంతా ఒకేచోట ఐదు గ్రహాలను భూమి నుంచి చూసే అవకాశం కలగనుంది. ఈ మేరకు నాసాకు చెందిన బిల్ కూక్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘సూర్యాస్తమయం తర్వాత పశ్చిమం వైపు చూడాలి. 50 డిగ్రీల పరిధిలో ఈ ఐదు గ్రహాలు కనిపిస్తాయి. ఇందులో గురుడు, శుక్రుడు, అంగారకుడిని మన కళ్ళతోనే చూడొచ్చు. బుధగ్రహం, యురేనస్‌ను మాత్రం బైనాక్యులర్ ద్వారానే చూడగలరు’అని సూచించారు.

రేపు (మార్చి 28)న రాత్రి అందరూ ఆకాశం వైపు చూడాలని సూచిస్తూ అమెరికా మాజీ ఖగోళ శాస్త్రవేత్త చంద్రుడిపై నడిచిన తొలి వ్యొమగాముల్లో ఒకరైన డాక్టర్ బజ్ ఆల్డ్రిన్ పేర్కొన్నారు. ‘కనీసం ఐదు గ్రహాలను కలిగి ఉండే గ్రహాల అమరిక కోసం నెలాఖరున ఆకాశం వైపు చూడటం మర్చిపోవద్దు. దానితో పాటు చంద్రుడు కూడా ఉంటాడు. అన్ని భూమి నుండి చూసినట్లుగా దాదాపు ఆర్క్ ఆకారంలో కనిపిస్తాయి’ అంటూ ఆయన పేర్కొన్నారు. 2022 జూన్‌లోనూ ఇలాంటి అద్భుతమే ఒకటి కనిపించింది. నాడు బుధ గ్రహం, శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని ఒకే లేఖనం పైకి వచ్చాయి. మీరు కూడా రేపు ఆకాశం వైపు చూడటం మర్చిపోకండి.

Also Read...

శ్రీరామనవమి.. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే!

Advertisement

Next Story

Most Viewed