స్కూల్‌ గ్రూప్‌లో వినాయకచవితి పోస్ట్ డిలీట్.. ప్రిన్సిపల్ అరెస్ట్

by karthikeya |
స్కూల్‌ గ్రూప్‌లో వినాయకచవితి పోస్ట్ డిలీట్.. ప్రిన్సిపల్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: స్కూల్ గ్రూప్‌లో వినాయకచవితి పోస్ట్‌ డిలీట్ చేసి కటకటాల పాలయ్యాడు ఓ ప్రిన్సిపల్. సదరు ప్రిన్సిపల్ మైనారిటీ (Minority) వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో మిగిలిన గ్రూప్ సభ్యులంతా నిరసనకు దిగారు. ఫలితంగా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘనట రాజస్థాన్‌ (Rajasthan)లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం అనేక పాఠశాలలు పాఠశాల నిర్వహణ కోసం వాట్సాప్ గ్రూపు (Whats App Group)లు సిద్ధం చేసుకుంటున్నాయి. పాఠశాలలో పనిచేసే టీచర్లు, బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, గార్డియన్స్‌తో పాటు ప్రిన్సిపల్స్ కూడా ఆ గ్రూపుల్లో సభ్యులుగా ఉంటున్నారు. అదే విధంగా ఘటన జరిగిన కోటా జిల్లాలోని ఓ గవర్నమెంట్ స్కూల్‌లో టీచర్లు, ప్రిన్సిపల్‌తో పాటు మిగిలిన సిబ్బంది కలిసి స్కూల్ డెవలప్‌మెంట్ కమిటీ గ్రూప్ వినియోగిస్తున్నారు.

కాగా.. ఆ గ్రూప్‌లో వినాయకచవితి (Ganesh Chaturthi) సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ కొందరు సభ్యులు శుక్రవారం (Friday) పోస్ట్‌లు షేర్ చేశారు. అయితే మైనారిటీ వర్గానికి చెందిన ప్రిన్సిపల్‌ మహమ్మద్ షఫిక్‌ (Mohammad Shafiq).. అదే రోజు ఆ పోస్ట్‌లను డిలీట్ చేశాడు. దీంతో గ్రూప్‌లోని ఇద్దరు హిందూ టీచర్లతో పాటు మిగిలిన సభ్యులంతా ఆగ్రహానికి గురయ్యారు. స్కూల్ వద్ద నిరసనకు దిగారు. వారికి మద్దతుగా గ్రామంలోని హిందువులు, కొంతమంది హిందూ సంఘాలకు (Hindu Groups) చెందినవాళ్లు కూడా నిరసనలకు దిగడమే కాకుండా.. ప్రిన్సిపల్‌పై కేసు కూడా పెట్టారు.

సమాచారం అందగానే స్కూల్ వద్దకు చేరుకుని శాంతిభద్రతలకు ముుప్పు వాటిల్లకుండా స్కూల్ పరిసరాల్లో పోలీసులను మొహరించామని కోటాలోని బపవర్ కల స్టేషన్ ఆఫీసర్ ఉత్తమ్ సింగ్ తెలిపారు. అలాగే సదరు ప్రిన్సిపల్‌పై సెక్షన్ 196, (మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించడం - Disturbing the Social Harmony) కింద కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed