నోరు జారిన మంత్రి.... నెట్టింటా వీడియో వైరల్

by S Gopi |
నోరు జారిన మంత్రి.... నెట్టింటా వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం మహారాష్ట్రకు సంబంధించిన ఓ మంత్రి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ సమస్య పరిష్కారం కోసం రిక్వెస్ట్ చేసిన ఓ వ్యక్తిపై సదరు మంత్రి ఆగ్రహం వ్యక్తం నోరు పారేసుకున్నారు. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... మధ్యప్రదేశ్ వ్యవసాయ శాఖమంత్రి విజయ్ షా ఓ వ్యక్తి పట్ల దురుసుగా ప్రవర్తించారు. కాంద్వా జిల్లాలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఓ వ్యక్తి తన భార్య అంగన్ వాడీ సెంటర్ లో పని చేస్తుందని, అయితే, గత ఆరు నెలల నుంచి ఆమెకు జీతం రావడంలేదని సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో సదరు మంత్రి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్ను ఎవరు పంపించారో నాకు తెలుసు.. ఎక్కువ మాట్లాడితే నీ కాలు విరగొట్టిస్తా అంటూ అతడిపై సీరియస్ అయ్యారని అందులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed