కాంగ్రెస్‌లో ఆ పార్టీ విలీనం: పంజాబ్‌లో కీలక పరిణామం

by samatah |
కాంగ్రెస్‌లో ఆ పార్టీ విలీనం: పంజాబ్‌లో కీలక పరిణామం
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్‌లోని పాటియాలాకు చెందిన ఆప్ మాజీ ఎంపీ ధరమ్‌వీర్ గాంధీ సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు పవన్ ఖేరా, పంజాబ్ ఏఐసీసీ ఇన్‌చార్జి దేవేంద్ర యాదవ్, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్, ప్రతాప్ సింగ్ బజ్వాల ఆధ్వర్యంలో ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు. ధరమ్ వీర్ చేరికతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని బజ్వా చెప్పారు. కాగా, వృత్తి రీత్యా డాక్టర్ అయిన ధరమ్ వీర్ సింగ్ 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు. అనంతరం 2014 ఎన్నికల్లో పాటియాలా లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆప్ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. అనంతరం 2016లో ఆప్‌కు గుడ్ బై చెప్పి నవన్ పంజాబ్ అనే పార్టీని స్థాపించారు.2019 ఎన్నికల్లో తన పార్టీ తరఫున పోటీ చేసినప్పటికీ అంతగా ప్రభావం చూపలేదు. తాజాగా ఆయన తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ధరమ్ వీర్ సింగ్ మరోసారి పాటియాలా నుంచి బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ స్థానం నుంచి ఆప్ తన అభ్యర్థిని ఖరారు చేసింది.

Advertisement

Next Story

Most Viewed