- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
India-Canada: విదేశాల్లోని దౌత్యవేత్తలకు సీక్రెట్ మెమో..!
దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్థానీ వేర్పాటువాది నిజ్జర్ హత్యపై భారత్-కెనడా (India-Canada) మధ్య దౌత్యపరమైన విబేధాలు కొనసాగుతున్నాయి. కాగా.. ఇలాంటి టైంలో విదేశాల్లోని దౌత్యవేత్తలకు కేంద్రం సీక్రెట్ గా మెమో (MEA Secret Memo) ఇచ్చారని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. కాగా.. ఆ అంశంపై విదేశాంగశాఖ స్పందించింది. వైరల్ అవుతున్న ఆ మెమో నకిలీదని వెల్లడించింది. ‘అది నకిలీది. అలాంటి మెమో (Secret Memo) ఏదీ కేంద్ర ప్రభుత్వం జారీ చేయలేదు’ అని విదేశీ వ్యవహారాలకు చెందిన ఎక్స్‌టర్నల్ పబ్లిసిటీ అండ్ పబ్లిక్ డిప్లొమసీ విభాగం వెల్లడించింది. భారత దౌత్యవేత్తలకు హింసాత్మక నేరాలకు అంటగడుతూ తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపింది.
నకిలీ మెమోలో ఏముందంటే?
ఇకపోతే, భారత విదేశాంగ శాఖ పేరు (External Affairs Ministry)తో ఓ మెమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2023 ఏప్రిల్ తేదీతో ఉన్న ఆ మెమోను మాజీ విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వత్రా జారీ చేసినట్లుగా ఉంది. కెనడా (Canada)లోని ఖలిస్థానీ వేర్పాటువాదులను అడ్డుకునేందుకు భారతీయ మూలాలున్న గ్రూప్‌లతో ఓ బలమైన దళాన్ని ఏర్పాటు చేయాలని భారత దౌత్యవేత్త (Indian Diplomats)లను ఆదేశించినట్లు అందులో ఉంది. ఇది వైరల్ గా మారడంతో కేంద్రం వివరణ ఇచ్చింది.