Mehbooba Mufti: పీడీపీ లేకపోతే ఎన్సీ నియంతృత్వ ధోరణితో ఉండేది.

by vinod kumar |   ( Updated:2024-09-08 12:02:59.0  )
Mehbooba Mufti: పీడీపీ లేకపోతే ఎన్సీ నియంతృత్వ ధోరణితో ఉండేది.
X

దిశ, నేషనల్ బ్యూరో: తమ పార్టీ లేకుంటే జమ్మూ కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నియంతృత్వ ధోరణితో పనిచేసేదని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ తెలిపారు. కశ్మీర్ లో సుపరిపాలనను నెలకొల్పింది పీడీపీ మాత్రమేనని చెప్పారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఎయిమ్స్‌ను స్థాపించింది తామేనని గుర్తు చేశారు. ఆదివారం అనంతనాగ్‌లో ముఫ్తీ మీడియాతో మాట్లాడారు. ఎన్సీ పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వారికి తగిన బుద్ది చెబుతారని చెప్పారు. పీడీపీ లేకపోతే ఎన్సీ ఇప్పటికీ నియంతృత్వ పోకడలనే అనుసరించేదని మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్ కార్యకర్తలపై ఎన్సీ గతంలో సామాజిక బహిష్కరణను అమలు చేసిన సమయాన్ని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్సీ, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు సిద్దాంతాలపై ఆధారపడి లేదని, అధికారాన్ని పంచుకునే మాత్రమేనని విమర్శించారు. కశ్మీర్‌లో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన నేపథ్యంలో ఎన్సీకి వ్యతిరేకంగా ముఫ్తీ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story