Mehbooba Mufti: కశ్మీర్ ఎన్నికల బరిలో మెహబూబా ముఫ్తీ కుమార్తె.. బిజ్‌బెహరా స్థానం నుంచి పోటీ

by vinod kumar |
Mehbooba Mufti: కశ్మీర్ ఎన్నికల బరిలో మెహబూబా ముఫ్తీ కుమార్తె.. బిజ్‌బెహరా స్థానం నుంచి పోటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) నేత మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. ప్రస్తుతం జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బిజ్‌బెహరా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. పీడీపీ సోమవారం విడుదల చేసిన ఎనిమిది మంది అభ్యర్థుల జాబితాలో ఇల్తిజా పేరు కూడా ఉంది. అయితే మెహబూబా ఎన్నికల్లో పోటీ చేయబోరని, ఇల్తిజా మాత్రమే బరిలో నిలవనున్నట్టు సమాచారం. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇల్తిజా..బ్రిటన్ లోని వార్విక్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత మెహబూబా నిర్బంధంలో ఉన్న టైంలో ఇల్తిజా వెలుగులోకి వచ్చారు. 2019లో తన తల్లిని అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మెహబూబా విడుదలైన తర్వాత, ఇల్తిజా మీడియా ఇంటరాక్షన్‌లు, మీటింగ్‌లలో ఆమెతో కలిసి ఉండేవారు. జమ్మూ కశ్మీర్ ప్రజలను ప్రభావితం చేసే సమస్యలు, నిర్ణయాలను చర్చించే లక్ష్యంతో ‘ఆప్కీ బాత్ ఇల్తిజా కే సాథ్’ అనే థీమ్‌తో ఓ వీడియో సిరీస్‌ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు తాజాగా పీడీపీ పార్టీ టికెట్ కేటాయించింది.

Advertisement

Next Story