ప్రభుత్వ ఏర్పాటుకు కొత్త కూటమిని ప్రకటించిన సంగ్మా

by Harish |
ప్రభుత్వ ఏర్పాటుకు కొత్త కూటమిని ప్రకటించిన సంగ్మా
X

షిల్లాంగ్: మేఘాలయాలో ప్రభుత్వ ఏర్పాటుకు నూతన కూటమిని నేషనల్ పీపుల్స్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కన్రాడ్ సంగ్మా ప్రకటించారు. మేఘాలయ డెమోక్రటిక్ అలియన్స్ 2.0 పేరుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సోమవారం తెలిపారు. అంతేకాకుండా ఎన్పీపీకి చెందిన 8 మంది, యూనిటెడ్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఇద్దరు, బీజేపీ, స్థానిక పార్టీ హెచ్‌ఎస్‌పీడీపీ నుంచి ఒక్కరి చొప్పున మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని తెలిపారు. గారో హిల్స్ నుంచి నలుగురు, ఖాసీ జైంటియా ప్రాంతం నుంచి 8 మంది ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. కూటమిలోని పార్టీలతో సమావేశమైన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఆదివారం ఎన్పీపీ-బీజేపీలకు యూడీపీ మద్దతు ఇవ్వడంతో మేఘాలయ ప్రభుత్వ ఏర్పాటు సంక్షోభం తీరింది. కొత్త ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రిగా కన్రాడ్ సంగ్మా మంగళవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరుకానున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story

Most Viewed