ప్రజ్వల్ రేవణ్ణ దౌత్యపరమైన పాస్‌పోర్ట్‌ రద్దుకు చర్యలు ప్రారంభించిన అధికారులు

by Harish |
ప్రజ్వల్ రేవణ్ణ దౌత్యపరమైన పాస్‌పోర్ట్‌ రద్దుకు చర్యలు ప్రారంభించిన అధికారులు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక హాసన్ నియోజకవర్గ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్యపరమైన పాస్‌పోర్ట్‌ను రద్దు చేసేందుకు పాస్‌పోర్ట్ చట్టంలోని నిబంధనల ప్రకారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు ప్రారంభించిందని అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం తెలిపారు. ఇప్పటికే ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసిన అధికారులు, దౌత్య పాస్‌పోర్ట్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వివరిస్తూ సమాధానం ఇవ్వడానికి 10 రోజుల గడువు ఇచ్చారు. లైంగిక వేధింపుల ఆరోపణలు రావడానికి ఒకరోజు ముందు ప్రజ్వల్ రేవణ్ణ దౌత్యపరమైన పాస్‌పోర్ట్‌‌ను ఉపయోగించి భారతదేశం నుంచి పారిపోయారు. కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించింది.

కర్ణాటక ప్రభుత్వం ఆయన దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని కేంద్రానికి అభ్యర్థన చేయగా, తాజాగా దీనిపై చర్యలను ప్రారంభించినట్లు విదేశీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇన్ని రోజులు దేశం విడిచి బయట ఉన్న ప్రజ్వల్ ఇప్పుడు భారతదేశానికి తిరిగి వస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి తర్వాత బెంగళూరుకు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మే 31 ఉదయం 10 గంటలకు సిట్ ముందు హాజరుకానున్నారు. ప్రజ్వల్‌ను అరెస్టు చేయాల్సి వస్తే విమానాశ్రయం నుండే అరెస్టు చేయవచ్చని కర్ణాటక హోం మంత్రి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed