- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mayawati: బుల్డోజర్ పాలిటిక్స్ ఆపండి.. సీఎం యోగీకి మాయవతి సూచన
దిశ, నేషనల్ బ్యూరో: బుల్డోజర్ రాజకీయాలు మానేసి, వన్యప్రాణుల నుంచి ప్రజలను కాపాడటానికి చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) చీఫ్ మాయవతి యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు సూచించారు. లక్నోలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ‘యూపీలోని కొన్ని జిల్లాల్లో వన్యప్రాణులు ప్రజలపై దాడులు చేస్తున్నాయి. దీంతో తమ జంతువులకు మేత ఏర్పాటు చేయలేకపోతున్నారు. దాడులను అరికట్టడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలి. వెంటనే ప్రణాళికలు రచించాలి’ అని వ్యాఖ్యానించారు. అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టకుండా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాలని హితవు పలికారు.
అంతేగాక ‘బస్తీ జిల్లాలో ఒక ప్రయివేట్ అంబులెన్స్ డ్రైవర్, రోగిని తీసుకెళ్తుండగా అతని భార్యపై లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడు, ఇది చాలా సిగ్గుచేటు. ప్రభుత్వం వెంటనే డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. బుల్డోజర్ రాజకీయాలను సుప్రీంకోర్టుకు వదిలివేయాలని, అక్కడ తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం బుల్డోజర్ చర్యలపై యూపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మాయవతి పై వ్యాఖ్యలు చేశారు.