- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనసు మార్చుకున్న మాయావతి.. తన రాజకీయ వారసుడిగా తిరిగి అతడి పేరే ప్రకటన
దిశ, డైనమిక్ బ్యూరో: బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తన మనసు మార్చుకున్నారు. తన రాజకీయ వారసుడిగా తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ ను తిరిగి నియమించారు. అలాగే బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ బాధ్యతలను తిరిగి అతడికే అప్పగించారు. గతంలో ఆకాశ్ ను తన రాజకీయ వారసుడిగా ప్రకటిస్తూ బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ బాధ్యతలను మాయావతి అప్పగించారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ సార్వత్రిక ఎన్నికలకు ముందు మే7వ తేదీన ఆకాష్ ఆనంద్‌ను బీఎస్పీలో అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు మాయావతి ప్రకటించారు. నేషనల్ కో ఆర్డినేటర్ గా తన సోదరుడు ఆనంద్ కొనసాగుతారని ఆమె అప్పట్లో తెలిపారు. ఆకాష్ ఆనంద్ కు మరింత రాజకీయ పరిపక్వత వచ్చే వరకు ఈ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవం అనంతరం జూన్ 23న ఉదయం లక్నోలో పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాయావతి తన రాజకీయ వారసుడు ఆకాష్ ఆనంద్ అని పార్టీ జాతీయ సమన్వయకర్త పదవిని తిరిగి కట్టబెట్టింది. దీంతో బీఎస్పీలో మరోసారి ఆకాష్ ఆనంద్ కీలకం కాబోతున్నట్లు చర్చ జరుగుతోంది.