హ్యాపీ న్యూ ఇయర్.. సమృద్ధ భారత్ కోసం ప్రతిజ్ఞ చేద్దాం : రాష్ట్రపతి

by Hajipasha |
హ్యాపీ న్యూ ఇయర్.. సమృద్ధ భారత్ కోసం ప్రతిజ్ఞ చేద్దాం : రాష్ట్రపతి
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం మొదటి రోజున దేశ ప్రజలంతా సమృద్ధమైన సమాజాన్ని, దేశాన్ని నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. కొత్త సంకల్పాలు, కొత్త లక్ష్యాల‌తో ముందుకు సాగేందుకు నూతన సంవ‌త్స‌రం రాక అనేది కీలకమైన సంద‌ర్భంగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ‘‘2024 సంవత్సరం అందరికీ సంతోషం, శాంతి, శ్రేయస్సులను తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాం. దేశ పురోభివృద్ధికి మనమంతా బాధ్యతగా సహకరించాలి’’ అని రాష్ట్రపతి చెప్పారు. భారతదేశంతో పాటు విదేశాలలో నివసిస్తున్న భారతీయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలను ఈసందర్భంగా తెలియజేశారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసిింది.

Advertisement

Next Story