సెక్రటేరియట్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

by GSrikanth |
సెక్రటేరియట్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ సెక్రటేరియట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం ఉదయం 9:30 గంటల నుంచి భవనంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఉదయాన్నే సచివాలయానికి వచ్చిన అధికారులు మంటలను గమనించి పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడో అంతస్తులో మంటలు ఎగిసిపడుతుండటం ఉద్యోగులను భయందోళనకు గురిచేసింది. మంటలను గమనించి స్థానికులు అక్కడినుంచి పరుగులు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story