- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Breaking News : 24 మంది దళితుల ఊచకోత.. ముగ్గురికి ఉరిశిక్ష

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 24 మంది దళితుల ఊచకోత(Dalit Massacre) కేసులో నేడు న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ముగ్గురికి మరణశిక్ష(Death Sentence) విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఉత్తరప్రదేశ్(UP) లోని దిహాలీ నరమేధం(Dihali Massacre) జరిగిన 44 ఏళ్ల తర్వాత నిందితులకు శిక్ష పడటంతో బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 1981లో యూపీలోని ఫిరోజాబాద్ జిల్లాలోని దిహాలీ గ్రామంలోని ఎస్సీ కాలనీలోకి సాయుధ దుండగుల బృందం.. నరమేధం సృష్టించారు. కాలనీలో కనిపించిన వారిని కనిపించినట్టు కాల్చి పారేశారు. ఓ కేసులో తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన కుటుంబాన్ని చంపే క్రమంలో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ దారుణకాండలో చిన్నపిల్లలు, మహిళలతో సహ 24 మంది ప్రాణాలు విడిచారు.
ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. పోలీసులు 17 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. వారిలో 14 మంది రిమాండ్ కాలంలో మరణించగా.. ముగ్గురు మిగిలున్నారు. దాదాపు 44 ఏళ్లపాటు మెయిన్ పురి(Mianpuri) కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగింది. ఎట్టకేలకు మిగిలిన ముగ్గురు నిందితులకు మరణశిక్ష విధిస్తూ కోర్ట్ తీర్పు వెలువరించింది. దీంతో బాధిత కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. తమవారి మరణాలకు న్యాయం దక్కిందని వారు అభిప్రాయపడగా.. ఒక దారుణ హత్యాకాండలో న్యాయం పొందడానికి 4 దశాబ్దాల కాలం పట్టిందని మేధావులు, ప్రజలు పెదవి విరుస్తున్నారు.