- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Manish Sisodia : మనీష్ సిసోడియాకు బెయిల్.. సంబరాలు చేసుకున్న కుటుంబ సభ్యులు

దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో ఆప్ నేత మనీష్ సిసోడియా గత 17 నెలలుగా తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. లిక్కర్ కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు ఈ రోజు మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది.దీంతో అతని కుటుంబ సభ్యులు న్యూఢిల్లీలో సంబరాలు చేసుకున్నారు. సిసోడియా ఈ కేసులో అరెస్టయిన 17 నెలల తర్వాత జైలు నుంచి బయటకు రానున్నారు. ఈ సందర్భంగా.. ఆయన నివాసంలో మనీష్ సిసోడియా భార్య సీమా సిసోడియా ,ఇతర కుటుంబ సభ్యులు సంతోషంలో స్వీట్లు పంచుకొని తిన్నారు.
శుక్రవారం ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన కొద్ది నిమిషాల తర్వాత మనీష్ సిసోడియా నివాసంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. DDU మార్గ్‌లోని AAP ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ నాయకులు ,కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. సిసోడియాకు బెయిల్ వచ్చిన ఆనందంలో మంత్రి సౌరభ్ భరద్వాజ్ సహా పలువురు నేతలు పార్టీ కార్యకర్తలకు స్వీట్లు పంచారు.