Manish Sisodia : నియంతృత్వానికి వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ పోరాడాలి.. మనీష్ సిసోడియా

by Maddikunta Saikiran |
Manish Sisodia : నియంతృత్వానికి వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ పోరాడాలి.. మనీష్ సిసోడియా
X

దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో గత 17 నెలల నుండి జైలులో ఉన్న మనీష్ సిసోడియా నిన్న బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ రోజు ఆయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రధాన కార్యాలయలయానికి వచ్చారు. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా కార్యకర్తలను ఉద్దేశించి సిసోడియా మాట్లాడూతూ.. బీజేపీ పార్టీలోని వ్యక్తులు రాజ్యాంగం కంటే శక్తివంతులు కాదని , బీజేపీ ప్రభుత్వం నాయకులను జైల్లో పెట్టడమే కాకుండా పౌరులను కూడా వేధిస్తోందని, ఈ “నియంతృత్వానికి” వ్యతిరేకంగా దేశంలోని ప్రతి వ్యక్తి పోరాడాలని పిలుపునిచ్చారు.

అలాగే తాను భజరంగబలి దయ వల్ల 17 నెలల తరువాత బయటకి వచ్చానని, జైలులో ఉన్నప్పుడు బెయిల్ గురించి ఆందోళన చెందలేదని తెలిపారు. అయితే బీజేపీకి విరాళం ఇవ్వలేదన్న కారణంతో వ్యాపారవేత్తలపై ఫేక్ కేసులు పెట్టి జైలుకు పంపడం చూసి బాధపడ్డానని పేర్కొన్నారు. సిసోడియా ఆప్ కార్యకర్తలతో మాట్లాడుతూ.. 'మేము రథానికి గుర్రాలమే, కానీ మా నిజమైన రథసారథి ( కేజ్రీవాల్ ) జైలులో ఉన్నాడు, త్వరలోనే అతను బయటకు వస్తాడని' అన్నారు. ఏడెనిమిది నెలల్లో తనకు న్యాయం జరుగుతుందని ఆశించినా 17 నెలలు పట్టిందన్నారు. అయితే చివరికి న్యాయం గెలిచిందని సిసోడియా అన్నారు.

Next Story