Manish Sidodia: బీజేపీ నుంచి ఆ ఆఫర్ వచ్చింది.. మనీష్ సిసోడియా సంచలన ఆరోపణలు

by Shiva |
Manish Sidodia: బీజేపీ నుంచి ఆ ఆఫర్ వచ్చింది.. మనీష్ సిసోడియా సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) సమీపిస్తున్న వేళ అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) సినీయర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా(Manish Sidodia) బీజేపీ (BJP)పై సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను తిహార్ జైల్లో (Tihar Jail) ఉండగా.. బీజేపీ (BJP) పెద్దల నుంచి ఢిల్లీ (Delhi)కి ముఖ్యమంత్రి చేస్తామనే ఆఫర్ వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

జైల్లో ఉంటూ తాను చాలా ఇబ్బందులు పడుతున్నాననే విషయం బీజేపీ (BJP) పెద్దలకు అర్థం అయిందని అన్నారు. తన భార్యకు అనారోగ్యం, కుమారుడు చదువుకుంటున్నారనే విషయం వాళ్లకు కూడా తెలుసని అన్నారు. ఆ సమయంలోనే బీజేపీ (BJP) పెద్దల నుంచి ‘అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejrival)ను వదిలెయ్.. లేదా జైల్లోనే మగ్గిపో’ అన్నట్లుగా అల్టిమేటం ఇచ్చారని మనీష్ సిసోడియా (Manish Sisodia) సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

Next Story

Most Viewed