Manipoor voilance: మణిపూర్‌ను రక్షించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే.. ఎంపీ బిమోల్ అకోయిజం

by vinod kumar |
Manipoor voilance: మణిపూర్‌ను రక్షించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే.. ఎంపీ బిమోల్ అకోయిజం
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌ను రక్షించే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని, రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిన మతపరమైన, విభజన శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇన్నర్ మణిపూర్ ఎంపీ అంగోమ్చా బిమోల్ అకోయిజం అన్నారు. బుధవారం ఆయన లోక్ సభ జీరో అవర్‌లో ఈ అంశంపై ప్రసంగించారు. విభజన శక్తులు, అక్రమ వలస దారులు14 నెలలుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రంలో శాంతి ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తున్నారన్నారు. రాజ్యాంగంలోని ఒకటో షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా మణిపూర్‌ను రక్షించడానికి భారత ప్రభుత్వానికి చారిత్రక, రాజకీయ, నైతిక, చట్టపరమైన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.

మణిపూర్‌లో ఆర్టికల్ 19 ప్రకారం.. రాష్ట్రంలోని హైవేలు, భూభాగాలపై ప్రజలు స్వేచ్ఛగా తిరిగే సామర్థ్యాన్ని కలిగి ఉండేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిర్వాసితుల ఆస్తులకు భద్రత కల్పించాలని కోరారు. ‘అంతర్గతంగా నిర్వాసితులైన ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలి. శాంతి ప్రక్రియను అణచివేయడానికి ఇళ్లు తగులబెడుతున్నారు. గ్రామాలను తుడిచిపెట్టే ప్రయత్నాలు కలచివేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలి’ అని చెప్పారు. భద్రతా దళాల మధ్యవర్తిత్వంతో జిరిబామ్ జిల్లాలో రెండు సంఘాలు ఒప్పందం చేసుకున్నా.. దురదృష్టవశాత్తు వారు మత, విభజన మతతత్వ శక్తులచే అణచివేయబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed