అదృష్టం అంటే ఇదే.. రూ.500 తో లక్షాధికారి.. చండీగఢ్ లో అల్లు అర్జున్ మూవీ సీన్ రిపీట్

by Prasad Jukanti |   ( Updated:2024-04-02 12:37:13.0  )
అదృష్టం అంటే ఇదే.. రూ.500 తో లక్షాధికారి.. చండీగఢ్ లో అల్లు అర్జున్ మూవీ సీన్ రిపీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: చండీగఢ్ లో అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ సీన్ రిపీట్ అయింది. సినిమాలో ప్రకాశ్ రాజ్ కొనుగోలు చేసిన షేర్స్ చివర్లో హీరోను ధనవంతుడిగా చేసినట్లు చండీగఢ్ కు చెందిన ఓ తాతా కొనుగోలు చేసిన షేర్స్ అతడి మనువడికి లక్షల ఆదాయం తెచ్చిపెట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటనలో అసలేం జరిగిందంటే.. చండీగఢ్ లోని తన్మయ్ మోతివాలా ఒక వైద్యుడు. ఇటీవల ఆయన తన కుటుంబ ఆస్తులకు సంబంధించిన దస్తావేజులను సర్దుతుండగా ఎస్ బీఐ కి చెందిన షేర్ సర్టిఫికెట్ దొరికింది. అది 1994లో తన తాత రూ.500 విలువైన షేర్లు కొనుగోలుకు సంబంధించిన పేపర్. వాటిని చూసిన మోతివాల ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.దీంతో వెంటనే ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి తన సంతోషాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. 'మా గ్రాండ్ పేరెంట్1994లో రూ.500 విలువైన ఎస్ బీఐ షేర్లను కొనుగోలు చేశారు. ఆ తర్వాత దాని గురించి మర్చిపోయారు. వారు దానిని ఎందుకు కొనుగోలు చేశారో, వాటిని అలాగే ఎందుకు అలాగే ఉంచుకున్నారో తెలియదు. కుటుంబ ఆస్తులను ఆర్గనైజేషన్ చేస్తుండగా నాకు ఈ షేర్ సర్టిఫికెట్ దొరిగింది. ప్రస్తుతం దీని వాల్యుయేషన్ గురించి చాలా మంది అడిగారు. ఇది డివిడెండ్‌లను మినహాయించి దాదాపు 3.75 లక్షలపైనే ఉంటుంది. అంటూ తన సంతోషాన్ని రాసుకొచ్చారు. అయితే తనకు ప్రస్తుతం నగదు అవసరం లేనందునా ఈ షేర్లను కాను కొనసాగించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పోస్టును చూసిన నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఇది నిజమైన పెట్టుబడి.. మన పెద్దలను చూసి నేర్చుకోవాలి అంటూ ఒక నెటిజన్ షేర్ చేయగా తన విషయంలోనూ ఇలాంటి సంఘటనే జరిగిందని మరొక నెటిజన్ కామెంట్ చేశారు. మీ తాతగారు కొనుగోలు చేసిన షేర్స్ విషయం ఎలా ఉన్నా వాటికి మీరు చెబుతున్నంత రిటర్న్ రావంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.


Advertisement

Next Story

Most Viewed