- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Supreme Court: నా మెదడును మెషిన్‌తో కంట్రోల్ చేస్తున్నారు
దిశ, నేషనల్ బ్యూరో: తన మెదడును కొందరు మెషిన్‌తో(Brain Control Machine) నియంత్రిస్తున్నారని, ఆ యంత్రాన్ని డియాక్టివేట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీకి చెందిన ఓ ఉపాధ్యాయుడు సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ వేశారు. హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైంటిఫిక్ ల్యాబరేటరీ(CFSL) నుంచి మానవ మెదడును నియంత్రించే మెషిన్‌ను కొందరు ఉపయోగించి తన మెదడును కంట్రోల్ చేస్తున్నారని వివరించారు. సెప్టెంబర్ 27న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చిన ఈ పిటిషన్‌ను జడ్జీలు తిరస్కరించారు. ముందుగా ఈ పిటిషన్ ఏపీ హైకోర్టులో ఫైల్ అయింది. ఈ పిటిషన్‌పై అపిడవిట్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు సీబీఐ, సీఎఫ్ఎస్ఎల్‌కు నోటీసులు పంపింది. తాము ఆయనపై ఎలాంటి ఫోరెన్సిక్ ఎగ్జామ్ చేయలేదని, కాబట్టి, అసలు డీయాక్టివేట్ చేయాలనే ప్రశ్నే ఉదయించదని స్పష్టం చేశాయి. హైకోర్టు ఆ పిటిషన్ కొట్టేయగా.. ఈ తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ వింత పిటిషన్ పరిశీలించి తోసిపుచ్చారు. ఈ సమస్యను అర్థం చేయడానికి పిటిషనర్‌తో అతని మాతృభాష అయిన తెలుగులో మాట్లాడి వివరించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది.