Mamatha Benarjeee: కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు..బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

by vinod kumar |
Mamatha Benarjeee: కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు..బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అస్థిరంగా ఉందని, కాబట్టి ఎప్పుడైనా కూలిపోవచ్చని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఆదివారం కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అమరవీరుల దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ..బెంగాల్‌తో భారత్ సత్సంబంధాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. సమావేశానికి హాజరైనందుకు అఖిలేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. యూపీలో ఎస్పీ సాధించిన విజయం ఎంతో అభినందనీయమని కొనియాడారు. కేంద్ర ఏజెన్సీలన్నింటినీ ఉపయోగించి భయపెట్టాలని చూసినా ఎస్పీ దానిని ధీటుగా ఎదుర్కొందని తెలిపారు. ఏజెన్సీలను నియమించి, ఎన్నికల కమిషన్‌ను బెదిరించి ఢిల్లీలో ఏర్పాటైన ప్రభుత్వం స్థిరంగా లేదని, ఆ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చని నొక్కి చెప్పారు.

మతతత్వ శక్తులు కుట్రలు చేస్తున్నాయి: అఖిలేష్ యాదవ్

ఈ ర్యాలీకి హాజరైన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ..కేంద్రంలోని మతతత్వ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని తెలిపారు. దేశాన్ని అస్థిరపరిచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. వారు ఎలాగైనా అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారని, కానీ ఆ ప్రయత్నాలు ఫలించబోవని స్పష్టం చేశారు. ‘దేశాన్ని మతపరంగా విభజించాలనుకునే శక్తులు తాత్కాలిక విజయం సాధించొచ్చు. కానీ చివరికి వారు ఓడిపోతారు’ అని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఢిల్లీలోని ప్రభుత్వం నడవలేక పోతుందని విమర్శించారు. ఎక్కువ రోజులు కొనసాగే చాన్సే లేదని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed