- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mamath benarjee: లైంగిక దాడి నిందితులను కఠినంగా శిక్షించేలా చట్టం తేవాలి.. మోడీకి మమతా బెనర్జీ మరో లేఖ
దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై జరిగిన లైంగిక దాడి, హత్య ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీకి శుక్రవారం మరో లేఖ రాశారు. ‘రేపిస్టులను కఠినంగా శిక్షించేలా చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 22న లేఖ రాశాను, అయితే ఇలాంటి సున్నితమైన అంశంపై మీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి సమాధానం వచ్చినా సమస్య తీవ్రతను పట్టించుకోలేదు. లైంగిక దాడి, హత్య వంటి క్రూరమైన నేరాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకురావాలని మరోసారి అభ్యర్థిస్తున్నా’ అని పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా కేసును ముగించే నిబంధన కూడా ఈ చట్టంలో ఉండాలని తెలిపారు. ఇప్పటికైనా స్పందించి కఠిన చట్టాలను తేవాలని డిమాండ్ చేశారు.
‘ప్రస్తుత డేటా ప్రకారం దేశంలో ప్రతిరోజూ 90 లైంగిక దాడులు జరుగుతున్నాయి. చాలా సందర్భాల్లో బాధితురాలు హత్యకు గురవుతోంది. ఈ ధోరణి భయానకంగా ఉంది. మహిళలకు భద్రత కల్పించడం మన కర్తవ్యం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కేసులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో విచారించాలి. బాధితురాలికి సత్వర న్యాయం జరగాలంటే 15 రోజుల్లోగా విచారణ పూర్తి చేయాలి’ అని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని తమ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి ఇప్పటికే గణనీయమైన చర్యలు చేపట్టిందని తెలిపారు.