బెంగాల్ లో మహిళల భద్రత గురించి జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు

by Shamantha N |
బెంగాల్ లో మహిళల భద్రత గురించి జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌ ఉద్రిక్తతలపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్పందించారు. బెంగాల్ దాడులు జరుగుతూంటే మమతా బెనర్జీ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. బెంగాల్ లో మహిళలకు భద్రత లేదని సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు. మతం పేరుతో చేస్తున్న దారుణానికి ఇటీవల జరిగిన ఘటన నిదర్శనం అని అన్నారు. ఆ ఘటనను వ్యతిరేకించకుండా కొందరు టీఎంసీ ఎమ్మెల్యేలు సమర్థిస్తున్నారని ఫైర్ అయ్యారు. సందేశ్‌ఖాలీ, ఉత్తర దినాజ్‌పూర్ ఇలా ఏ ప్రాంతాల్లోనూ మహిళలకు భద్రత లేదన్నారు. పశ్చిమబెంగాల్‌ మహిళలకు సురక్షితం కాదని పేర్కొన్నారు.

బెంగాల్ లో అమానవీయ ఘటన

వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంతో బెంగాల్ లో ఓ జంటపై దాడి జరిగింది. ఈ వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కర్రతో ఓ జంటను ఇష్టానుసారం కొడుతున్న వ్యక్తి ఉత్తర్‌ దినాజ్‌పుర్‌ జిల్లాలోని చోప్రా ప్రాంత టీఎంసీ నేత తాజ్‌ముల్‌ అలియాస్‌ జేసీబీగా గుర్తించి అరెస్టు చేశారు. సుమోటోగా కేసు నమోదుచేసిన పోలీసులు బాధిత జంటకు రక్షణ కల్పించినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed