కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ మమతా బెనర్జీ

by Harish |   ( Updated:2024-03-23 08:28:14.0  )
కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ మమతా బెనర్జీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. ప్రజల చేత ఎన్నికైన ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నా మద్దతు, సంఘీభావాన్ని తెలియజేయడానికి వ్యక్తిగతంగా శ్రీమతి సునీతా కేజ్రీవాల్‌తో మాట్లాడాను. ఎన్నికైన ప్రతిపక్ష ముఖ్యమంత్రులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని అరెస్ట్ చేయడం దారుణం. అయితే బీజేపీతో కలిస్తే మాత్రం సీబీఐ/ఈడీల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను మాత్రం ఏం చేయరు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని మమతా బెనర్జీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో భాగంగా కేజ్రీవాల్‌ను గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన కీలక ప్రతిపక్ష నేతలు బీజేపీపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఎక్స్‌లో స్పందిస్తూ, ఎన్నికలకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రిని ఈ విధంగా టార్గెట్ చేయడం పూర్తిగా తప్పు, అలాగే ఇది రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు. ప్రత్యేకించి సార్వత్రిక ఎన్నికలు వస్తున్న తరుణంలో ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేయడం రాజ్యాంగ విరుద్ధమని శరద్ పవార్ అన్నారు.

Advertisement

Next Story