Mallikarjun karge: బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ల అడ్డంకులు: మల్లికార్జున్ ఖర్గే విమర్శలు

by vinod kumar |
Mallikarjun karge: బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ల అడ్డంకులు: మల్లికార్జున్ ఖర్గే విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ముడా కాంపెన్సేటరీ భూ కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి ఆ రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతివ్వడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. బీజేపీ నియమించిన గవర్నర్లు బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో అనేక సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రతి పనికీ అడ్డుతగులుతూ వివాదాలు రేపుతున్నారని ఫైర్ అయ్యారు. శనివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ ఎందుకు అనుమతించారో తెలుసుకుంటామన్నారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, బీజేపీయేతర ప్రభుత్వం ఉన్న చోట గవర్నర్లు సమస్యలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్లు బీజేపీకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. అయితే కేసు వివరాలు పూర్తిగా తెలియదని న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed