- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్ ‘ఘర్ ఘర్ గ్యారెంటీ’.. ఏమిటిది తెలుసా ?
దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. బుధవారం ఈశాన్య ఢిల్లీలోని ఉస్మాన్‌పుర్, కైత్వాడ ఏరియాలలో ‘ఘర్ ఘర్ గ్యారెంటీ’ కార్యక్రమాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ‘పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారెంటీ’ (ఐదు న్యాయాలు, 25 హామీలు) వివరాలను దేశంలోని ప్రతీ ఇంటికీ తెలియజేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఆయన వెల్లడించారు. ‘‘మా హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికే ఈ గ్యారెంటీ కార్డులను పంచుతున్నాం. ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు ఈ కార్డులను అన్ని వర్గాలకు చేర్చాలి. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఏం చేస్తుందనే వివరాలు ఈ గ్యారెంటీ కార్డుల్లోనే ఉన్నాయి’’ అని ఆయన తెలిపారు.
ప్రధాని మోడీపై విమర్శలు
ఈసందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఖర్గే విమర్శలు గుప్పించారు. హామీలను నిలబెట్టుకోవడంలో బీజేపీ విఫలమైందన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఏదైనా హామీ ఇస్తే కట్టుబడి ఉంటుంది. ప్రధాని మోడీ ఇచ్చే గ్యారెంటీలు బూటకం. ఆయన హామీ ఎన్నటికీ నెరవేరదు. గతంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాల గురించి మోడీ మాట్లాడారు. కానీ, అది నెరవేరలేదు’’ అని కాంగ్రెస్ చీఫ్ విమర్శించారు. ‘‘ఐటీ దాడులతో ప్రధాన ప్రతిపక్షాన్ని బెదిరించాలని మోడీ చూస్తున్నారు. ఐటీ విభాగం మా పార్టీకి చెందిన రూ.135 కోట్లను స్వాధీనం చేసుకొంది. ప్రజాస్వామ్యంలో ఇలానేనా ఎన్నికలు నిర్వహించేది..? ప్రజలు ఈ ఎన్నికల ద్వారా దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నారు’’ అని ఖర్గే పేర్కొన్నారు.
ఏప్రిల్ 5న మేనిఫెస్టో విడుదల
కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ‘పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారెంటీ’పైనే ఆధారపడింది. దీనిలో యువన్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, హిస్సేదారి న్యాయ్ ఉన్నాయి. ఇవి కాకుండా మరో 25 గ్యారెంటీలను కూడా హస్తం పార్టీ ప్రకటించింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 5న రాజస్థాన్‌లోని జైపూర్‌లో పార్టీ అగ్రనాయకులతో ఏర్పాటుచేయనున్న సభలో విడుదల చేయనున్నారు. ఆ మర్నాడే హైదరాబాద్‌లో భారీ సభను నిర్వహించనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఆకట్టుకునేలా ‘హాత్ బదలేగా హాలత్’ పేరిట నినాదాన్ని విడుదల చేసింది.