‘ఇండియా’ కూటమి చైర్మన్‌గా మల్లికార్జున్ ఖర్గే!

by samatah |   ( Updated:2024-01-13 11:32:03.0  )
‘ఇండియా’ కూటమి చైర్మన్‌గా మల్లికార్జున్ ఖర్గే!
X

దిశ, నేషనల్ బ్యూరో/డైనమిక్ బ్యూరో: కేంద్రంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి కన్వీనర్ ఎవరనేదా ఉత్కంఠకు తెర పడింది. కూటమి కన్వీనర్‌గా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నియామకమయ్యారు. ఈ మేరకు శనివారం జరిగిన కూటమి నేతల వర్చువల్ మీటింగ్ లో ఖర్గేను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కూటమి చీఫ్ గా బిహార్ సీఎం నితీశ్ కుమార్‌ను కన్వీనర్‌గా ఎన్నుకుంటారని కొన్నిరోజులుగా ప్రచారం జరిగింది. కానీ ఈ పదవి రేస్ నుంచి అనూహ్యంగా చివరి నిమిషంలో నితీశ్ కుమార్ తప్పకున్నట్లు సమాచారం. కూటమికి అధ్యక్షుడిగా కాంగ్రెస్ కు చెందిన నేత బాధ్యతలు చేపడితే బాగుంటుందనే అభిప్రాయాన్ని నితీశ్ వెలిబుచ్చినట్లు సమాచారం.అంతకు ముందు నితీశ్ కుమార్ ను కూటమి చీఫ్ గా చేయాలని జేడీయూ ప్రతిపాదనను వ్యతిరేకించిన తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకించింది. మెజార్టీ పార్టీ నేతలు ఖర్గే పేరునే ప్రతిపాదించడంతో కూటమి అధ్యక్షుడి బాధ్యతలకు ఖర్గేను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఆ ఇద్దరు గైర్హాజరు:

ఇవాళ జరిగిన వర్చువల్ మీటింగ్ కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తో పాటు తదితరులు హాజరయ్యారు. అయితే బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లు ఈ భేటీకి అటెండ్ కాలేదు. మీటింగ్ పై సమాచారం ఉన్నప్పటికీ ఇతరత్రా షెడ్యూల్ కారణాల వల్లే మమతా హాజరు కాలేకపోయి ఉండవచ్చని టీఎంసీ వర్గాలు తెలిపాయి. ఇక ఇవాళ్టి సమావేశంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి చెందిన పార్టీల మధ్య సీట్ల షేరింగ్ విషయం కొలిక్కిరాలేదని తెలుస్తోంది. సీట్ల పంపకాలపై నేతల మధ్య చర్చలు జరుగుతున్నా ఇంకా ఫైనల్ నిర్ణయం జరగడం లేదు. కూటమికి బలోపేతం, మనుగడకు కీలకంగా భావిస్తున్న కన్వీనర్ పోస్ట్ ఎవరిది అనేది తేలిపోవడంతో సీట్ల సర్దుబాటు అంశం కూడా త్వరలోనే ఫైనల్ అవుతుందని ఇండియా కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పై కీలక బాధ్యతలు:

ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్ పార్టీకి మరోసారి కీలక బాధ్యతలు దక్కాయి. గతంలో ఎన్డీయే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న వాజ్ పేయ్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో ప్రతిపక్షాలు యూపీఏ (యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్) ఏర్పాటైంది. ఈ కూటమి 2004, 2009 రెండు దఫాలుగా కేంద్రంలో అధికారంలో కొనసాగింది. అనంతరం 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి చేతిలో ఓటమి కావాల్సిన వచ్చింది. దీంతో నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలో రాకుండా అడ్డుకునే ఉద్దేశంతో ప్రతిపక్షాలన్ని యూపీఏ స్థానంలో ఇండియా కూటమిని గతేడాది జులై 18న ఏర్పాటు చేశాయి. అయితే యూపీఏ కూటమిలో కాంగ్రెస్ కే చైర్మన్ పోస్ట్ దక్కగా మరోసారి ఇండియా కూటమిని సైతం ముందుండి నడిపించే అవకాశం హస్తం పార్టీకే దక్కింది.

Advertisement

Next Story