Mallikarjun karge: బడ్జెట్ ప్రకటనలన్నీ బూటకమే..కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే

by vinod kumar |
Mallikarjun karge: బడ్జెట్ ప్రకటనలన్నీ బూటకమే..కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించిన పథకాలన్నీ బూటకమేనని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అభివర్ణించారు. ‘ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాలు’కు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఇంకా అందించలేదని తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కుర్చీ బచావో బడ్జెట్‌లో వెల్లడించిన పరిశ్రమ అనుబంధిత ప్రోత్సాహక పథకాలకు సంబంధించిన వివరాల కోసం పరిశ్రమ వర్గాలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ‘కోట్ల మంది యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం కావాలి. కానీ మోడీ ప్రభుత్వం తాత్కాలిక పరిష్కారం కూడా ఇవ్వకుండా వారిని మోసం చేస్తోంది’ అని తెలిపారు. దేశంలో నిరుద్యోగాన్ని పరిష్కరించడానికి దీర్ఘకాలిక పరిష్కారమేదీ లేదని వెల్లడించారు. విద్యాసంస్థలు, పరిశ్రమలకు ఈ పథకం విధి విధానాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఈ పథకాన్ని ప్రకటించే ముందు ప్రభుత్వం వాటాదారులతో సంప్రదించిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ‘రైట్ టు అప్రెంటీస్‌షిప్’ కార్యక్రమాన్ని కేంద్ర కాపీ కొట్టిందని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed