Metarnity Leave : మెటర్నిటీ లీవ్ తీసుకున్న ఉపాధ్యాయుడు.. చివరికి ఏమైందంటే?

by M.Rajitha |
Metarnity Leave : మెటర్నిటీ లీవ్ తీసుకున్న ఉపాధ్యాయుడు.. చివరికి ఏమైందంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : బీహార్లో(Bihar) ఓ ఉపాధ్యాయుడు మెటర్నిటీ లీవ్(Metarnity Leave) తీసుకున్న ఘటన సంచలనం రేపింది. వైశాలీ జిల్లాలోని హాసనపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న జితేంద్ర కుమార్ సింగ్(Jithendra Kumar Singh) అనే ఉపాధ్యాయుడు సెలవుల కోసం అప్లై చేసుకోగా, అతనికి మెటనర్నిటీ లీవ్స్ మంజూరు అయ్యాయి. అయితే ఇదేమని ప్రశ్నించకుండా జితేంద్ర కుమార్ వాటిని వినియోగించుకున్నాడు. అయితే విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ లోణే సిబ్బంది సెలవుల కోసం అప్లై చేసుకోవాల్సి ఉండటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ వైరల్ కావడంతో అధికారులు దర్యాప్తు చర్యలకు దిగారు.

Advertisement

Next Story