ఇటలీలో రెచ్చిపోయిన ఖలిస్థానీ వేర్పాటువాదులు.. మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం

by Shamantha N |
ఇటలీలో రెచ్చిపోయిన ఖలిస్థానీ వేర్పాటువాదులు.. మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటలీలో ఖలిస్థానీ వేర్పాటువాదులు రెచ్చిపోయారు. మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఖలిస్థానీ మద్దతుదారులు ధ్వంసం చేశారు. మహాత్మా గాంధీ విగ్రహం కింది భాగంలో హర్దీప్ సింగ్ నిజ్జర్ కు సంబంధించిన వివాదాస్పద నినాదాలు రాశారు. జూన్ 14న ఇటలీలో జీ7 సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. కాగా.. ప్రధాని పర్యటనకు ముందు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం కలకలం రేపింది.

స్పందించిన ఇటలీ ప్రభుత్వం

ఈ ఘటనపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయాన్ని ఇటలీ అధికారుల ఎదుట భారత్ లేవనెత్తిందని విదేశాంగ కార్యదర్శి క్వాత్రా తెలిపారు. విగ్రహానికి ఇటలీ ప్రభుత్వం మరమ్మతులు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు, ఘటన తర్వాత ఆ ప్రాంతాన్ని అత్యంత తక్కువ సమయంలోనే క్లీన్ చేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు. గతేడాది ఇదే తరహాలో కెనడాలో గాంధీ విగ్రహం ధ్వంసం అయ్యింది. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో యూనివర్సిటీ క్యాంపస్‌లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఖలిస్థాన్ తీవ్రవాదులు ధ్వంసం చేశారు.

Advertisement

Next Story

Most Viewed