- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శరద్ పవార్‌కు మరో షాక్.. మహారాష్ట్ర స్పీకర్ కీలక నిర్ణయం
దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రకు చెందిన రాజకీయ దిగ్గజం శరద్ పవార్‌కు మరో షాక్ తగిలింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఎన్‌సీపీలోని శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ గురువారం కీలక నిర్ణయం ప్రకటించారు. అజిత్ పవార్ వర్గానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను స్పీకర్ తోసిపుచ్చారు. ఎన్‌సీపీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెంటే ఉన్నందున.. ఆ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేమని స్పీకర్ నార్వేకర్ స్పష్టం చేశారు. ‘‘ఎన్సీపీపై ఎమ్మెల్యేల తిరుగుబాటు జరగలేదు.. కేవలం ఆ పార్టీ నేతల మధ్య అసమ్మతి ఏర్పడింది. దాని ఫలితంగానే రెండు వర్గాలు ఏర్పడ్డాయి’’ అని ఆయన చెప్పారు. కాగా, అసలైన ఎన్సీపీ అజిత్ పవార్‌దే అని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం ప్రకటించింది. దీంతో ఆ పార్టీ పేరు (ఎన్సీపీ), గుర్తు (గడియారం) అజిత్ పవార్ వర్గానికే దక్కాయి. అనివార్య పరిస్థితుల్లో శరద్ పవార్ తన వర్గానికి కొత్త పేరు (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్ చంద్ర పవార్)ను ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసుకున్నారు.