మహారాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఫడ్నవిస్

by Javid Pasha |
మహారాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఫడ్నవిస్
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ.. ‘పంచామృత్’ సూత్రంతో రాష్ట్ర బడ్జెట్ కు రూపకల్పన చేశామని ఆయన అన్నారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగాలు, పర్యావరణ సంరక్షణే లక్ష్యంగా తమ బడ్జెట్ ను రూపొందించామని చెప్పారు.

మహారాష్ట్ర బడ్జెట్ లోని ముఖ్య విశేషాలు ఇవే..

1. పీఎం కిసాన్ యోజన పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.9,900 కోట్లు కేటాయించారు.

2. ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు పీడీఎస్ స్కీమ్ కు బదులు ఏడాదికి రూ.1,800 ఆర్థిక సాయం అందజేయనున్నారు.

3. మహిళా పాలసీ కింద బీపీఎల్ కుటుంబాలలోని ఆడపిల్లల సంరక్షణ కోసం వాళ్లకు 18 ఏళ్ల వయసు వచ్చే వరకు రూ.75 వేలు ఆర్థిక సాయం అందజేయనున్నారు.

4. 50 శాతం ఛార్జీలతో రాష్ట్ర ప్రభుత్వ బస్సుల్లో మహిళకు ప్రయాణ వసతి కల్పించనున్నారు.

5. థానే, నాసిక్, పింప్రి-చించ్వాడ్ లో మెట్రో నిర్మాణం కోసం రూ.39 వేలు కేటాయించారు.

6. పీఎం ఆవస్ ఘరుకుల్ యోజన పథకం కింద మొత్తం 10 లక్షల ఇళ్ల నిర్మాణం కోసం రూ.12 వేల కోట్లు కేటాయించారు.

Advertisement

Next Story

Most Viewed