- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PM Modi: బ్రేకులు, చక్రాలులేని మహా వికాస్ అ’గాడీ’.. ప్రతిపక్షాలపై మోడీ విమర్శలు
దిశ, నేషనల్ బ్యూరో: బ్రేకులు, చక్రాలు లేని గాడీ.. మహా వికాస్ అఘాడీ (Maha Vikas Aghadi) అని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ధూలేలో నిర్వహించిన ప్రచార సభలో మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. డ్రైవర్ సీటు కోసం మహా వికాస్ అ‘గాడీ’(Maha Vikas Aghadi) నేతలు పోట్లాడుకుంటున్నారని ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఎన్నికలు (Maharashtra elections) సమీపిస్తుండటంతో ప్రతిపక్ష కూటమిలో ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే విషయంపై అంతర్గత పోరు జరుగుతోందని విమర్శించారు. “మహా వికాస్ అఘాడీ.. ‘గాడి’కి చక్రాలు, బ్రేకులు లేవు. డ్రైవర్ సీటులో ఎవరు కూర్చుంటారనే దాని కోసం అంతర్గత పోరు నడుస్తోంది. రాజకీయాల్లో వారి ఏకైక లక్ష్యం దోచుకోవడమే. మహాయుతి (Mahayuti) అధికారంలో కొనసాగితేనే రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే.. దానికి విరుద్ధంగా కొందరు మాత్రం ప్రజలను లూటీ చేసేందుకే రాజకీయాల్లో ఉంటారు. రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తారు." అని మోడీ విమర్శలు గుప్పించారు.
మహాయుతితోనే అభివృద్ధి సాధ్యం
బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి మాత్రమే రాష్ట్రంలో సుపరిపాలనను అందించగలదని ప్రధాని మోడీ(PM Modi) విశ్వాసం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రజలను ఏది అడిగినా హృదయపూర్వకంగా ఇచ్చేస్తారని అన్నారు. దేశంలో ఉన్న గిరిజన వర్గాలను విభజించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. వారంతా ఐక్యంగా ఉన్నంతకాలం బలంగా ఉంటారని.. ఏ శక్తీ వారిని అడ్డుకోలేదని అన్నారు. జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) అసెంబ్లీలో జరుగుతున్న గందరగోళాన్ని మోడీ ప్రస్తావిస్తూ ఇండియా కూటమి అక్కడ అధికారంలోకి వచ్చిన వెంటనే కశ్మీర్‌పై వారి కుట్రను ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించారని.. అది ఎప్పటికీ జరగదని నొక్కి చెప్పారు.